ఏప్రిల్ ఫూల్ అన్న మాట క్రైస్తవులైన మనము నీ సహోదరుడుతో గాని నీ
సహోధరితో
గాని చెప్పవచ్చా?? మీరేమంటారు??
చెప్పవచ్చు అంటే మరి బైబెల్ ఏమంటుంది ???
దేవునికి
మహిమ కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా ప్రతి యెడు మనము ప్రపంచమంతా ఏప్రిల్ 1st
అనగానే గుర్తుకోచ్చేది అంతే కాక ఒకరితో ఒకరు చెప్పుకునే మాట “ఏప్రిల్ ఫూల్”(APRIL FOOL). మరి ఏప్రిల్ ఫూల్ అన్న మాట క్రైస్తవులైన మనము నీ
సహోదరుడుతో గాని నీ సహోధరితో గాని చెప్పవచ్చా?? మీరేమంటారు??
గమనించండి, మనమధరము తెలియకుండా Messages, Images WhatApp, Face book లాంటివి ఎన్నో ఉపయోగించుకొని
ఎన్నో విధాలుగా ఒకరిని ఒకరు సరదాగానే ఫూల్ల్స్ చేస్తుంటాము. ఫూల్ అయినందుకు నీవు
ఎంతో సంతోషపడుతుంటాము. ఇలా ప్రపంచములో ఉన్న ఎన్నో దేశాలు ఏప్రిల్ ఫూల్ అని ఇతరులను
ఫూల్స్ చేస్తుంటారు. కాని విషయానికి వస్తే మనము కూడా అదే త్రోవలో వెళ్తున్నాము.
ఏది మంచిది ఏది రమ్యమైనది, ఏది
ఖ్యాతి కలది, ఏది మాన్యమైనది అని తెలుసుకోకుండా ఏది పడితే
దానిని నమ్మి వాటిని ఆచరిస్తూ అంతేకాకుండా మన ఇంటివారికి స్నేహితులకు కూడా
నేర్పిస్తున్నాము కామా??? నిన్ను వల్లే నీ పోరుగువాడిని
ప్రేమించు అన్న దేవుని ఆజ్ఞను త్రుణికరించి ఫూల్స్ చేయాలనీ ఉబలాట పడుతున్నావ.
ఫూల్స్ అయిన తరువాత ఎంతో ఆనందపడుతున్నవే మరి దేవుని వాక్యం ఏమి చెపుతుందో? చూస్తావా ??
మత్తయి 5:22:
నేను మీతో చేపునదేమనగా తన సహోదరుని మీద ప్రతి వాడు మహా సభకు లోనగును.
ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును.
తెలుగులో ద్రోహి అని
ఉన్నదని సందేహమా?? అయితే
ఇంగ్లీష్ వెర్షన్ లో ఇలా వ్రాయబడింది
Matthew
5:22
But I say unto you. That
whosoever is angry with his brother without a cause shall be in danger of the
judgment. And whosoever shall say to his brother. Raca, shall be in danger of
the council: but whosoever shall say. Thou Fool, shall be in danger of hell fire.
మరి
మనము సాదారణముగా “YOU FOOL” అని అంటుంటాము. యు ఫూల్ అనటము కూడా పాపమే! అది నీకు తెలియకుండానే
నిన్ను పాపములోకి ఈడుస్తుంది. నా ప్రియ సహోదరుడా, సహోదరి మత్తయి 22:39 నిన్ను
వలే నీ పొరుగువాడిని
ప్రేమించు అన్న దేవుని ఆజ్ఞను మనము April Fool అని
ఒకరిని ఒకరు ఫూల్ చేసుకుంటూ నీకు నీవుగా దేవుని ఆజ్ఞను త్రుణికరించి పాపములో
పడుతునవేమో గమనించవా!! ఇలా నీ సహోధరుడును సహోధరిని ప్రేమించక ఫూల్స్ చేసుకుంటుపోతే (మత్తయి 22;37) దేవుని ప్రేమ నీలో ఉండక నీ ప్రేమే దేవుని మీద ఉండబోదు.
మనమే
పాపం చేస్తూ చెప్పవలసిన్నది పోయి మనము కూడా పాపముకు ప్రేరేపిస్తున్నాము .
క్రింద
రిఫరెన్స్ చూసినట్లయితే అర్థమవుతుంది.
యేహెజ్కేలు 3:21:
పాపము
చేయవలదని నీతి గల వానిని హెచ్చరిక చేయగా అతడు హెచ్చరించబడి పాపమూ చేయక మానిన యెడల
అతడు అవశ్యముగా బ్రతుకును, నీ
మట్టుకు నీవును (ఆత్మను) తప్పించుకొందువు
పాపము
చేసిన వ్యక్తి “నీతిమంతుడు”
మరి అలాంటి నీతిమంతుడుకి మనము హెచ్చరిక
చేయువారిగా ఉండాల్సింది పోయి మనమే చేస్తున్నాము.
కొల్లసి 2:20-22:
మీరు
క్రీస్తుతో కుడా లోకము యొక్క మూలపాటముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకు
చున్నట్లుగా మనుషులు ఆజ్ఞలను పద్దతులను అనుసరించి చేత
పట్టుకోనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు
అను విధులకు , మీరు లోబడనేల?
లోకములోనివి
మన హృదయములోకి తీసుకుంటే అవి నీకు హానికరమవుతుంది. అవీ మనలను నాశనముకు పైగా దేవునికి దూరము
చేస్తాయి.
యకోభు 4:4
ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబటి
ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.
ఈ
లోకనుసారులుగా జీవిస్తు క్రైస్తవుడగా చెలామణి అవుతున్న ఓ నా ప్రియ సహోదరుడా, సహోదరి ఈ రోజు నుంచైనా దేవుని
వాక్యము ఏమి చెపుతుందో దాని పట్టుకొని దాని ప్రకారం జీవిస్తు లోకములోని వాటిని నిన్ను తాకకుండా మనుషులు ఏర్పరచిన
పద్దతులను, ఆచారాలను,
ఆలోచనలను సరిచూచుకొని, సరి చేసుకొని క్రీస్తు వైపుకే నడవాలని ఆకాంక్షిస్తూ
ఇట్లు
JOEL SHAROFF
0 comments:
Post a Comment