బైబిల్ ను ఎన్నడు పటించని వానికీ ఆరాధనకు ఎన్నడు హాజరు కాని వానికి
సహితం పరిచయమైన రెండు బైబిల్ పదాలు ఉన్నవి..
అవి: 1. నరకము
2. పరలోకము
మానవుల ఆత్మలకు రెండు గమ్యాలున్నవని దైవ వాక్యం స్పస్టముగా చెప్పుచునది.. అవి "నరకము మరియు పరలోకము". మరణించిన వారు ఇక ఎన్నడు ఉండడు.. మనిషికి మరణమే అంతము.. ఆపై వేరేమి ఉండదు - అని బైబిల్ చెప్పడము లేదు కాని మానవునికి గల నిత్యమైన ఒక్క గమ్యము గురించి బైబిల్ స్పస్టముగా మనకు తెలియచేయుచునది..
నీవు ఒక్క విషయము తెల్సుకోవల్సినది ఎమింటంటే.. మానవుడు నిత్యత్వము కోసం సృష్టించబడ్డాడు.
బయట పరవేయటం కోరకు నీవు ఒక్క గడియారాని తయారు చేస్తావా? లేక కొంటావా? భూమి ఆకాశములు తయారు చేసిన ఆ గొప్ప సృష్టికర్త యే ఉద్దేశమా ? గమ్యము లేకుండా నిన్ను సృష్టించాడని నివనుకుఉంటునావా..? మానవుడు నిత్యత్వము కోసం సృష్టించబడ్డాడు.. తరువాత ఈ జీవితము తరువాత మరో జీవితము ఉన్నది..
అయితే అది ఎలాంటిది ? సాధారణంగా విత్తిన విత్తనము వలెనే దాని పంట ఉంటుందని మనకు తెలుసు.. ఒకడు బార్లీ గింజలు విత్తి గోధుమలు కోయాలని అనుకోగాలడా..? ఎంత మాత్రము అనుకోలేడు. ఒకడు ఎ విత్తనము విత్తితే అదే పంట కోయడము ప్రకృతి సూత్రము. దేవుని ధర్మము కూడా ఇదే.. కాబట్టి గలతీ 6:7 లో " మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్థునో ఆ పంటనే కోయును" అని బైబెల్ లో వ్రాయబడింది..
నిత్యత్వాని గూర్చిన నిర్ణయాన్ని ఇక్కడే తీసుకోవాలి. కష్టాలతో కూడిన ఈ కొద్ది పాటి జీవితము విత్తనము మనము నాటే సమయము. అది ఎటువంటి విత్తనము అయితే అలంటి విత్తనము కోస్తాము అని గుర్తెరగాలి..
మానవుని యొక్క రెండు గమ్యాలను గురించి యేసు తరచూ మాట్లాడాడు.. మరణించిన పిదప ఆత్మ ఈ రెండు స్ధలాల్లో ఒక్క దానిని చేరుతుందని ఒకనాడు శరీరము ఆత్మతో కలసిపోతుందని ఆయన చెప్పారు. అవే నరకము మరియు పరలోకము.
ఇంతకు మానవుడు నరకానికి ఎందుకు వెళతాడు..
దేవుడు మనిషిని చేసినది మరణించటానికి కాదు.. నిత్య జీవము కలిగి ఉండుటకు.. కాని మనుష్యుడు పాపము చేసి పాపముకు హత్తుకొని జీవించుట ద్వార నిత్య నరకముకు వెళుతున్నాడు.. పాపము చేస్తూ మనము జీవించుటకు మనష్యులను దేవుడు కలుగాచేయలేదు.. కాని మనుష్యుడు పాపమునకు అలవాటు పడిపోయి పాపమునే అలవాటుగా చేసుకొని బ్రతుకుతున్నాడు.. అదే అలవాటును కొనసాగిస్తూ నిత్య మరణముకు పాత్రుడవుతున్నాడు.. దానినిబట్టి మనుష్యుడు నరకముకు వెళ్ళుతున్నాడు..
ఈ విధముగా దేవుని దయను, మన పట్ల ఆయన కలిగి ఉన్న కృప ను పక్కన పెట్టి పాపములో పడిపోతున్నాము.. నరకపు ద్వారములోకి అడుగు పెడుతున్నాము..
విమోచన
దేవుని నిత్యమైన ప్రేమలోనున్న గొప్ప అద్బుతం ఇదే. మనము చేసిన పాపపు పనులను బట్టి నరకమే తగిన శిక్ష, కాని దేవుడు మన మీద కలిగిన ప్రేమను బట్టి మనము చేసిన పాపములను బట్టి దేవుడే తగిన శిక్ష పొందాడు.. ఎందుకనగా మనలను రూపించుకున్నాడు కాబట్టి ఏ దేవుడు చేయనివంటి గొప్ప కార్యము యేసు క్రీస్తు మనకొరకు చేసాడు.. మనకొరకు అయన చనిపోయి తన రక్తమును కార్చి మనము చేసిన పాపములకు తగిన శిక్ష తను అనుభవించాడు.. అనగా ఈ భూమిపై ఉండగా నిసించిన పాపులందరూ నరకములో అనుభవించిన బాధనంత ఆయన రక్షకునిగా, విమోచకునిగా తానె అనుభవించాడు. అయన యందే రక్షణ! అయన యందే నరకము నుండి విమోచన దొరుకును.
ఈ రక్షణ , విమోచన మారు మనసు పొంది విశ్వాసముతో ఆయనను వెదకు వారికీ మాత్రమే లబించును. కృపా ద్వారము ఇంకను తెరువబడియే ఉన్నది. యేసు ఆ ద్వారము వద్ద నిలువబడి మనలను పిలుచుచున్నాడు..
నీ మార్గములను గూర్చి ఆలోచించు..? జ్ఞానము కలిగి యుండు.. మరింత ఆలస్యం కాక మునుపే మారు
మనస్సు పొందు..
మనస్సు పొందు..
అయినప్పటికీ నీ జీవిత మార్గములో నిలిచిన ఒక సూచన...
ఇది పాపమార్గము, అవిశ్వాస మార్గము నరకానికి దారితీస్తాయి అని నిన్ను హెచ్చరిస్తున్నది...
ఇది పాపమార్గము, అవిశ్వాస మార్గము నరకానికి దారితీస్తాయి అని నిన్ను హెచ్చరిస్తున్నది...
ఓ మనుష్యుడా నీవు తప్పు మార్గం విడచి మారు మనస్సు పొందుమని నిన్ను వేడుకుంటున్నాను..
"నసించిన దానిని వెదకి రక్షించుటకు దేవుడు లోకమునకు వచెను..!!
"నసించిన దానిని వెదకి రక్షించుటకు దేవుడు లోకమునకు వచెను..!!
JOEL SHAROFF
0 comments:
Post a Comment