క్రైస్తవ జీవితము భక్తిగాను క్రమశిక్షణగాను ఉండుటకు అటు ఆత్మీయ జీవితమును ఇటు సామాజిక జీవితమును కూడా క్రమపరుచును. భక్తి అనేది మన ఆలోచనలలోను మరియు క్రియలలోను ఇతరులకు యేసుకు మాదిరిగా కనపడవలెను.
భక్తిగా ఉండుటకు ముఖ్యముగా మన జీవితములో ప్రార్ధన చాలా ప్రాముక్యము. దేవునితో మాటలాడుటయె ప్రార్ధన. దేవునితో అందరు మాట్లాడుటకు దేవుడు అవకాశము ఇచ్చిన మాట్లాడే వ్యక్తి జీవితము సరైనదిగా ఉన్నపుడు మాత్రమే ప్రార్ధనకు జవాబు దొరుకుతుంది.
ప్రార్ధనతో పాటుగా దేవునితో సహవాసము అనగా ఉపవాసము మరీ ప్రాముక్యమైనది.
ప్రతి క్రైస్తవుని జీవితములో మూడు రకముల శత్రువులను ఎదుర్కొనవలసి ఉన్నది.
§
శరీరము
§
లోకము
§
అపవాది
ఈ మూడింటిని క్రీస్తు నీ నిమిత్తము సిలువయందు జయించెను. క్రైస్తవ జీవిత ఎదుగుదలకు ప్రభువు వాక్యమందును, జివితమందును చూపినది. బైబెల్ విధానము "ఉపవాసము" నీ జీవితములోని కొన్ని కార్యములలో జయమును చూడగోరినచో ఉపవాస ప్రార్ధన తప్పనిసరిఅయిన సాధనము. యేసు నిన్ను ఉపవాసము ఉండుమని చెప్పుటలేదు గాని అట్లు చేయుమని చెప్పుచున్నాడు.
యెషయా 58 అద్యాయములో ఉపవాసము గూర్చి చెప్పబడినట్టు మొదటి 5 వచనములు ఉపవాసము ఏది కాదో చెప్పబడి ఉన్నది. మిగిలిన వచనములు ఉపవాసముండుట ఎట్లు మరియు ఉపవాసము వలన కలుగు ప్రయోజనములు గూర్చి వ్రాయబడినది. కాని ఉపవాసము యొక్క ముఖ్య ఉద్దేశము "నశించు ఆత్మల రక్షణ కొరకై ప్రేమ చేత నింపబడిన హృదయము కలిగి ఉండుటయే. అప్పుడు మాత్రమె ఉపవాస ప్రార్దన ద్వార వృద్ది చెంది దేవుని కార్యము నీ యందు చెయబూనుకొనును.
యెషయా 58 లో ఉపవాసము గూర్చి ముఖ్య ఉద్దేశ్యము:
Ä
దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు..
Ä
కాడిమాను మోకులు తీయుటయు ..
Ä
బాదించబడిన వారిని విడిపించుటయు..
Ä
ప్రతి కాడిని విరుగ గోట్టుటయు ..
ఇనాడు ఉపవాసము చేయకుండుటకు సాకులు చెప్పువానికి యెషయా 58 వ అధ్యాము సరియైన రీతిగా హెచ్చరించుచున్నది. ఉపవాసము అన్నది ఒక ఆత్మీయా సాధనము. ఎందుకనగా పాత్రను శుద్ధి చేయుట వలన ఆయన శక్తి, కృపా వరములు నీ యందు ప్రవహించుట వీలగును.
బైబెల్ చెప్పిన ఉపవాసము పాక్షికంగాను లేక సంపూర్ణముగా ప్రకృతి సంభందమైనట్టియు కోరికలను నేరవేర్చకుండునట్లు సమయమును వేరుచేసి, ఆత్మీయ పెరుగుదల కొరకును, ఆత్మీయ పోరాటామును ఎదుర్కొనుటకు సిద్దపడుట, ఆహారము మానుట (లూకా 4:2), భోజనము - పానము మానుట (ఎస్తేరు), ఆహారము, శరీర కోర్కెలను విసర్జించుట (I కోరంధి 7:5) సాధారణముగా ఉపవాసము అనగా ఆహారము మానుట అని మనము ఎరుగుదము. నిజమే, కాని చాలమంది ఆహారము మాని టీ, కాఫీ లేదా పానియములు తీసుకొంటుటారు.. కాని బైబెల్ ప్రకారముగా ఉపవాసము అనగా ఆహారము, పానియములు మాని అంతేకాకుండా ఆ సమయమంతా దేవునిలో దేవుని వాక్య ప్రకారముగా ఉన్నట్టి వాటిని ఆయన సన్నిధిలో ప్రార్తిస్తూ గడపాలి.. అంతే కాని ప్రార్థన లేకుండా ఉపవాసము ఉన్నట్లయితే ఆ ఉపవాసము వ్యర్థమె.. అది మనము బాగా గుర్తించుకోవాలి..
ఇక్కడ కొన్ని విషయములు గుర్తించండి..
ఉపవాసము ఎందుకు ఉండాలి:
v ప్రభువును సేవించుటకు (అ. కా 13:2,3)
v విస్వాసమందు ఎదుగుటకు ( మత్తయి 17:19-21)
v ప్రార్ధన యందు నిలుచుటకు ( I కొరంది 7:5)
v ఆత్మలో నడుచుటకు (రోమా 8)
v ఆత్మల రక్షణ కోరకు ( మార్కు 1:7)
v ఆత్మ నింపుదల (I కొరంది 12:11)
v లోకమును ఎదిరించుటకు సర్వాంగ కవచమును పొందుటకు ( కొల్లసి 2:15)
v ఆత్మలో ఉజ్జివము
v మనసును కేంద్రికృతము చేయు నూతన శక్తి
v శరిరమునకు ఆరోగ్యమును పొందుటకు.
F దేవుని వాక్యమును బట్టి ప్రతి క్రైస్తవుడు ఉపవాసముండి ప్రార్ధించవలెను
@
Joel Sharoff
0 comments:
Post a Comment