"నీ నోటి మాట వలన నీవు చిక్కుబడియున్నావు .
నీ నోటి మాట వలన నీవు పట్టుబడియున్నావు" సామెతలు 6:2
మీ నోటి ద్వార విడుదల చేయబడిన మాటల యొక్క ప్రాముఖ్యతను మీరు గమనించారా..? ఈ విషయాలు బహుశా మీలో కొందరికి బాధాకరంగా అనిపించవచ్చును. మీలో కొందరు రోగగ్రస్థులుగా ఉన్నారు. ఎందుకంటే మీరు రోగమును గూర్చి మాట్లాడుతున్నారు. మరి కొందరు కొరతలో జీవిస్తున్నారు. కారణం వారు గతములో పలికిన మాటలను బట్టి ఇప్పుడు మీరు ఆనారోగ్యమును లేదా ఆ కొరతను అనుభవిస్తున్నారు. ఇంకా విడమర్చి చెప్పాలంటే మీకు ఆరోగ్యము సరిగ్గా ఉన్నను ఇతరులతో "ఏమి ఆరోగ్యము లే నండి లేదా ఏమి వ్యాపారం లే నండి సరిగా జరగడం లేదు అని చాలా తేలికగా చేపెస్తుంటారు.. కాని దాని ఫలితము ఖచ్చితంగా ఏదో ఒక రోజు అనుభవించక తప్పదు.. నీ ఆరోగ్యం భాగున్నను ఇతరులతో అలాగున పలికినావు కాబట్టి. స్నేహితులారా, ఒకటి గుర్తించ్చుకోండి..నీ నోటికి సృష్టించే శక్తి ఉంది, మనము పలికిన మాటలే మనకు ఉచ్చువలె తయారయ్యాయి. వాటిలోనే మనం చిక్కుబడి ఉంటాము. కాబట్టి మనము జీవం కలిగిన మాటలే మాట్లాడాలి. ఆశీర్వాదపు మాటలనే మాట్లాడాలి కాని శాపపు మాటలు కాదు. అందుకని యేసు క్రీస్తు, మీలో ప్రతి వాడు తాను పలికిన మాటలకు లెక్క అప్పజేప్పవలసి ఉంటుందని చెప్పాడు. ఎఫేసియులకు వ్రాసిన పత్రికలో పౌలు "వ్యర్తమైన మాటలు మాట్లదకూడదని అని హెచ్చరిస్తునాడు”. వ్యర్తమైన మాటలు అంటే ఇతరుల ఆత్మ స్వ్దేర్యాని చంపే మాటలు, వాక్యానికి వ్యతిరేఖమైన మాటలు, విశ్వాసాన్ని నిర్వీర్యము చేసే మాటలు, ప్రజలు జీవితాలని కుంటుపరిచె మాటలు, ఇవ్వన్ని వ్యర్తమైన మాటలే. మన మాటల చేత మనము చిక్కుబడియున్నామని మనము గ్రహించాలి. "ఒకని నోటి ఫలము వాని కడుపు నిండును. తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును". అని సామెతలు 18:20 లో చెప్పబడియున్నది.
కాబట్టి నీవు ఆశీర్వదించబడగోరినట్లైతె నీవు ఆశీర్వాదపు వచనాన్ని మాట్లాడాలి. నీవు ఐస్వర్యవంతుడవు కాగోరినట్లయితే ఐశ్వర్య వచనాన్ని మాట్లాడాలి. అప్పుడు నీవు చేయునదంతయు సఫలమగును అని బైబిల్ చెపుతుంది.
భహుశా నీవు కార్లలో తిరుగుతుండవచ్చు, అంతమాత్రం చేత, నీ జీవితములో ఏదో సాధించేశాను అనుకోవటం పొరపాటే.. నీవు, నేను ఆధిపత్యం చెలాయించటానికి, పరిపాలించటానికి సృష్టీంచబడ్డాము. నీవు సమృద్ధిలో ఉండటానికి పిలువబడ్డావు. నీవు ఆశిర్వాదానికి కారకుడిగా ఉండటానికి పిలువబడ్డావు. దేవుడు అబ్రహామును పిలిచినపుడు, నీవు ఆశిర్వాదానికి కారకునిగా వుంటావు అన్నాడు. కాని ఇక్కడ మనము ప్రభుత్వ ఉద్ద్యోగం నుండి రీటైర్డ్ అయిన వెంటనే ఒక్క ఇల్లు కట్టుకొని ఇది చాలు అని స్థిరపడిపోతుంటారు. అది మన గురి కాదు. అనేకమైన వాటిని మరియు ఇతరులకు ఆశిర్వాదముగా ఉండటము దేవుని చిత్తము. అనగా నిన్ను అశిర్వదించటమె కాకుండా ఇతరులకు ఆశిర్వాదముగా ఉంచాడు. మరి ఇలాంటి ఆసిర్వాదం ఎపుడు నీకు ఉపయోగకరంగా ఉంటుందంటే నీవు మొదట దేవుని పోలిన వారై ఉండాలీ.. అంతేకాకుండా ఇచ్చు వారిగా ఉండాలి. అలాగున చేయగలిగితే ఖచితముగా నీవు దేవునిలో ఆశిర్వదించబడుదువు.
నా ఆశ ఏమిటంటే మీరందరు దేవునిలో బహుగా ఆశిర్వదించబడాలని, దేవుడు మనకొరకు ఏర్పరచిన ప్రతిది విశ్వాసముతో పొందుకోవాలని ప్రభువైన యేసు క్రీస్తు నామములో వేడుకుంటున్నాను.. మీకు ఇలాంటి సంగతులను తెలియజేయుటకు దేవుడు నాకిచ్చిన ఈ గొప్ప సందర్బమును బట్టి దేవునికి వందనములు తెలియజేస్తున్నాను..
దయచేసి సలహాలు, సూచనలు తెలియజేసి ప్రోత్సహించాలని మనవిచేసుకుంటున్నాను..
Joel Sharoff
0 comments:
Post a Comment