ప్రియమైనస్నేహితులారా, ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవులు ఓటమిలోను, విచారముతోను మరియు ఆయా సమస్యలతోను సతమతమవుతునారు. వాటిలోనుండి బయటకు రావటానికి ఎడతెగకుండా ప్రార్థన ఉపవాసాలు కూడా చేస్తునారు. కాని వారి జీవితాలలో ఎలాంటి ఫలితాన్ని అనుభావించలేకపోతున్నారు. వాస్తవానికి దేవుడు వారికి దూరంగా ఉన్నాడు అని కాదు. కాని వారు ఏదో ఒక విషయములో దేవుని వాక్యానుసారంగ జరిగించడంలేదని స్పష్టమవుతుంది. దేవుడు నియమించిన అనేకమైన ధర్మాలలో “నీ నోటి ఫలము” అనేది ఒకటి. దీనిని నేర్చుకొని అనుదినము పాటిస్తే అనేకమైన సమస్యలను దేవుని సహాయము ద్వార జయించగలము. ఈ మాటలు ద్వార తదుపరి అడుగులలో కొంతవరకైన సహాయపడుతుంది.
మందుగా మీరు ఒక ప్రాముఖ్యమైన విషయమును అర్థం చేసుకోవాలి. మనము మాట్లాడే మాటలు మనలను ఉన్నతమైన స్థితి కి తీసుకెళ్తుంది. లేదంటే కటిక బీదవారిగా మార్చివేస్తుంది. ఎలాగంటే మన పెదవులతో మనము ఏమి మాట్లాడుతున్నామో దానికంటే ఉన్నతమైన స్థాయికి మని విశ్వాసం ఎదుగదు. . ఇక్కడ మీరు బాగా ఆలోచించాల్సినదేమిటంటే మనము మాట్లాడే తీరు, పద్దతి, ఆలోచించే విధానము మారాలి. తద్వారా మనము మాట్లాడే పద్ధతి మారుతుంది. ఇంకా ఖచ్చితంగ చెప్పాలంటే మన నోటిమాటలను ఒప్పుకోలు అని చెప్పవచ్చును. మన ఒప్పుకోలు మన స్వా స్త్యమును మనకు సమకూరుస్తుంది.
దినమంత నేను ఇది సాధించలేను, నేను ఏమి చేయలేను. ఇది నా వాళ్ళ కాదు అనే మాటలను మీకు మీరే అలాంటివి మాట్లడుచు , ప్రార్థన సమయములో దేవుని సన్నిధికి, దేవా నన్ను ఆశీర్వదించు అని
ప్రార్థిస్తే, నీ ప్రార్థనకు జవాబు దొరుకుతుందా? నేను ఏమి చేసిన కూడా అది విజయవంతమవదు అని మట్లాదుతూ.చివరికి ప్రార్థన చేసే సమయములో "దేవా, నా జీవితములో ఒక అద్బుతము జరిగించు" అని ప్రార్తిస్తూ ఉంటారు. నీవు నా జీవితములో ఒక్క గొప్ప కార్యాన్ని చేస్తావని నమ్ముతున్నాను అని ప్రార్థిస్తే నీ ప్రార్థనకు జవాబు దొరుకుతుందని అనుకుంటున్నావా? దొరకనే దొరకదు. ఎందుకనగా, రాత్రి నీ చేసిన ప్రార్థనను పగలంతా నీవు ఏమి మాటల ద్వార నిర్వీర్యము చేసేసావు. కాబట్టి నీవు ఏమి మాటలాడుతున్నావో జాగ్రతగా గమనించాలి.
ఒప్పుకోలు లేదా నోటి మాటలు అనగా నిగంటువులో " సొంతము చేసుకొనుట", " గుర్తించుట", "చెప్పినదే మల్లి చెప్పుట" అనే నిర్వచానాలు ఇవ్వబడ్డాయి. అది మాత్రమే కాకుండా విశ్వాసమును ఒప్పుకొనుట లేదా విశ్వాసముతో మాట్లాడుట అనే అర్థము ప్రజలలో బాగా నాటుకుపోయింది. అందుకే ఒప్పుకోలు అనే పదానికి వేరే అర్థము కుడా ఉంది. ఒక వ్యక్తి తనకు ఉన్న విశ్వాసమును అనగా తాను నమ్మిన దానిని పలకడం కూడా ఒప్పుకోలే. గమనించండి, " నీ నోటి మాటలే నీకు స్వాస్త్యమును సమకూరుస్తాయి". మీరు పలికినదే పొందుకుంటారు అనే విషయాని అనేకులు బోదించుట మీరు వినే ఉంటారు. కానీ నీవు పలికితే సరిపోదు.. పలికే మాటే నీ హృదయములో లోతుగా వేర్లు నాటుకుపోవలి.
దేవుని వాక్యాని పలుకుట
"అది ఏమని చెప్పుచున్నది వాక్యము నీ యొద్దను, నీ నోటను నీ హృదయములోను ఉన్నది". రోమా 10:8-10. దీనిలో ఒక సూత్రము దాగి ఉంది. నీతి కలుగునట్లుగా మనుష్యుడు హ్రుదయములో విస్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోనును. నీ హృదయమందు నీవు విశ్వసించి నోటితో ఒప్పుకుంటావు.నీకు ప్రతిగా యేసు సిలువ మీద వ్రేలాడాడని, నీవు నీతిమంతునిగా తిర్చబడునట్లు మూడవ దినాన ఆయన తిరిగి లేచాడని నమ్ముతునావు.
ఆ విషయాన్నినీవు నమ్మినందును బట్టి , ఇప్పుడు నీవు ఆయనయే నీకు ప్రభువు అని ఒప్పుకున్నావు కాబట్టి రక్షణ పొందావు. నీతి కలుగునట్లుగా, వర్దిల్లునట్ట్లుగా కుడా ఒప్పుకోవచ్చు. జయం పొందునట్లుగా ఒప్పుకోవచ్చు. స్వస్థత పొందునట్లుగా ఒప్పుకోవచ్చు. పై వాక్య భాగాన్ని కేవలము రక్షణ అనే అంశానికి పరిమితం చేయలేము. రక్షణ అనగా ఏమిటో ముందు మనము తెలుసుకుంటాము.
రక్షణ పొందటానికి నీవు తీర్ధయాత్రలు చేయవలసిన అవసరం లేదు. పుణ్య క్షేత్రములు తిరుగవలసిన అవసరం లేదు. కాని నీవు అర్థం చేసుకోవాలసిందల, నీ రక్షణకు కావలసిన వాక్యము నీ యోద్దనే ఉన్నది. ఎక్కడ ఉన్నది? అది నీ నోటను, నీ నోటను నీ హృదయములో ఉన్నది. విజయానికి కావలసిన మాట ఎక్కడ ఉంది? అది వాక్యములో ఉంది, నీ నోటిలో ఉంది. నీ స్వస్థతకు కావలసిన మాట ఎక్కడ ఉంది? దేవుని వాక్యంలో ఉంది మరియు నీ నోటిలో ఉంది.. అందుకే పౌలు
1 కోరంది 5:6 లో వ్రాయబడినట్టుగా "నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును"
సామెతలు 18:20 "ఒకని నోటి ఫలము చేత కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును."
ఇక్కడ గమనించండి లోకం చెప్పే మాటలు కాదు..? నీ చుట్టునున్న పరిస్థితులు కాదు..?
దేవుని వాక్యమును, ఆయన వాగ్దానమును, మనము పలికే మాటను నమ్మాలి.. అప్పుడే నీవు విశ్వాసముతో పలికేవాటిని పొందుకుంటావు..
v "నీకు విజయము కావాలని కోరితే, విజయమును గూర్చి పలకాలి"
v "వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే నీ నమ్మిక మరియు నీ ఒప్పుకోలుతో ఎకిభావించాలి.."
v "మనము పలికే వర్తమైన మాటలవల్ల మనకు మనమే ఉచ్చును తయారుచేసుకుంటున్నాము అనగా చెడును సృష్టించుకొంటున్నాము "
v "ఈ భూమి మీద ఆదిపత్యం తీసుకోని దానిని ఎలుటకు మనము పిలువబడ్డాము"
Your compliments and suggestions also encourage us to keep striving to serve you better...
0 comments:
Post a Comment